
సరిపడా యూరియా ఇవ్వండి
సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య
మంచాల: రైతులకు సరిపడా యూరియా అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్యర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు రాజ్యమని గొప్పలు చెప్పుకొని ప్రభుత్వాలు వారి బాధలను పట్టించుకోవడం లేదన్నారు. రైతాంగ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడు మూతలు ఆడడం సరైంది కాదన్నారు. యూరియా అందించి అండగా నిలవాలన్నారు. వర్షాకాలం రైతాంగం పంటలు సాగు చేసే సమయంలో కొరత విధించడం ఎంత వరకు సమంజసం కాదన్నారు. వ్యవసాయ పనులు మానేసి రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూలో నిరీక్షించడం దారుణన్నారు. ఇప్పటికై నా యూరియా నిల్వలు పెంచాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి జంగయ్య, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ, చంద్రశేఖర్‌రెడ్డి, యాదయ్య, జంగయ్య, లెనిన్, ఐలయ్య, వినోద్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.