
ఆలయ భూమిలో రోడ్డు లేదు
ప్రహరీ నిర్మాణానికి అనుమతి ఇవ్వండి: కుర్మసంఘం
ఇబ్రహీంపట్నం రూరల్: బీరప్ప దేవాలయం భూమిలో రోడ్డు లేదని, ప్రహరీ నిర్మాణం చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆ ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వే నంబర్ 31లో 1.10 ఎకరాల విస్తీర్ణం భూమి 1995లో ఆలయానికి కొనుగోలు చేశామని తెలిపారు. అనంతరం చుట్టూ ప్రహరీ నిర్మించామన్నారు. కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు కూల్చి వేశారని, అలా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ భూమిలో మరలా ప్రహరీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోరే జంగయ్య, బండ రాజు, బీరప్ప, బాలం భాస్కర్, యాదగిరి, శివకుమార్, ఐలయ్య, సతీష్, రవి, భిక్షపతి, మల్లేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.