యువత క్రీడల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

యువత క్రీడల్లో రాణించాలి

Sep 4 2025 8:40 AM | Updated on Sep 4 2025 8:40 AM

యువత

యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలి విద్యుత్‌ ఏర్పాట్ల పరిశీలన నేటి అర్ధరాత్రి వరకే ‘మహా’ దర్శనం

నందిగామ: విద్యార్థులు, యువత తమకు ఇష్టమైన క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రపంచ స్థాయిలో రాణించాలని బ్యాడ్మింటన్‌ నేషనల్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఆకాంక్షించారు. మండల పరిధిలోని కన్హా శాంతివనంలోని గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో బీఏటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోనెక్స్‌ సన్‌రైజ్‌ 79వ సౌత్‌ జోన్‌ ఇంటర్‌ స్టేట్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌–2025 రెండో రోజైన బుధవారం జూనియర్స్‌ విభాగంలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత క్రమ శిక్షణతో సాధన చేయాలని, ఎక్కడ పొరపాటు చేస్తున్నామో గ్రహించి మరోసారి అలాంటి పొరపాటు చేయకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలు రాష్ట్రాల క్రీడాకారులు, కన్హా శాంతివనం ప్రతినిధులు పాల్గొన్నారు.

షాద్‌నగర్‌: ఆర్యవైశ్య సంఘం నాయకులు సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఈ పుస్తకాలను బుధవారం పట్టణంలోని కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులను విద్యలో ప్రోత్సహించడంలో భాగంగా దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 25వేల నోటు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గందె సురేష్‌, నాయకులు గణేశ్‌గుప్తా, రవికుమార్‌గుప్తా, లక్ష్మయ్య, రమాదేవి, బెజుగం రమేష్‌, బండారి రమేష్‌, మురళి, ఎల్కుర్తి జగదీశ్వర్‌గుప్తా, బద్రీనాథ్‌, దండు రాహుల్‌, నీల రవీందర్‌, మురళీగుప్తా, శంకర్‌, యశ్వంత్‌, మలిపెద్ది శ్రీనివాసులు, పోల శశిధర్‌, యంసాని శ్రీనివాసులు, త్రినాథ్‌, నంద కిషోర్‌, తాటి విజయ్‌, రమణ, రాము తదితరులు పాల్గొన్నారు.

బడంగ్‌పేట్‌: బాలాపూర్‌లోని విద్యుత్‌ ఏర్పాట్లను బుధవారం అధికారులను పరిశీలించారు. టీజీఎస్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ నర్సిహులు, జిల్లా జోన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ పాండ్య పరిశీలించారు. ఉత్సవ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనం రోజు శోభయాత్రకు తరలించే గణనాథుని వాహనం వెళ్లే దారి పొడవునా ప్రమాదాలు జరుగకుండా, విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్‌ సిబ్బందికి వారు ఆదేశాలు జారీ చేశారు. వీరి వెంట రాజేంద్రనగర్‌ ఎస్‌ఈ శ్రీరామ్‌మోహన్‌, కందుకూర్‌ డీఈ గోపాలకృష్ణ, మామిడిపల్లి ఏడీఈ శంకర్‌ తదితరులు ఉన్నారు. బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి, సమితి నిర్వాహకులు విద్యుత్‌ అఽధికారులను సన్మానించారు.

ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ మహా వినాయకుడి దర్శనానికి గురువారం అర్ధరాత్రి వరకే అను మతి ఉంటుందని, తర్వాత భక్తుల దర్శనాలు నిలిపివేస్తామని నిర్వాహకులు తెలిపారు. శని వారం మహా వినాయకుడి నిమజ్జనం సందర్భంగా షెడ్డు తొలగింపు పనులు, క్రేన్‌ ఏర్పాట్ల కారణంగా శీఘ్ర, సర్వదర్శనాలకు అవకాశం ఉండదు. భక్తులు గమనించి నిర్వాహకులకు, పోలీసులకు సహకరించాలని కోరారు.

యువత క్రీడల్లో రాణించాలి 1
1/2

యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి 2
2/2

యువత క్రీడల్లో రాణించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement