
కవిత వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్‌లో సంక్షోభం
షాద్‌నగర్: ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ సంక్షోభంలో కూరుకుపోయిందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన నేతలు కవిత మాటలతో మట్టి కొట్టుకుపోయే సమయం ఆసన్నమైందని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సాగు, తాగునీటి కోసం ప్రాజెక్టులను నిర్మించిందన్నారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేలాది కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని స్వయానా కేసీఆర్ కూతురే చెప్పడాన్ని బీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోవడం లేదన్నారు. ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరంపై జరిగిన అవినీతిని జస్టిస్ ఘోష్ కమిషన్ వెల్లడించిందని స్పష్టంచేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్‌ఎస్ ఆందోళనలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో పదేళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్ కవిత దెబ్బతో సంక్షోభంలో చిక్కుకుందన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు బాబర్‌ఖాన్, రఘునాయక్, చెంది తిరుపతిరెడ్డి, కొంకళ్ళ చెన్నయ్య, కృష్ణారెడ్డి, పురుషోత్తంరెడ్డి, జితేందర్‌రెడ్డి, చంద్రశేఖర్, ఇబ్రహీం, శ్రీను, వీరేశం, సుదర్శన్, అశోక్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్