
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
హుడాకాంప్లెక్స్: వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. సరూర్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డెంగీ వంటి విషజ్వరాలు రా కుండా అవగాహన కల్పించాలని, ఆస్పత్రికి వచ్చే బాధితులకు అందుబాటులో ఉండాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ గీత, మెడికల్ ఆఫీసర్ అర్చన, చంద్రశేఖర్ పాల్గొన్నారు.