మైసిగండి మైసమ్మ సన్నిధిలో శాసనసభ స్పీకర్‌ | - | Sakshi
Sakshi News home page

మైసిగండి మైసమ్మ సన్నిధిలో శాసనసభ స్పీకర్‌

Sep 2 2025 1:33 PM | Updated on Sep 2 2025 1:33 PM

మైసిగండి మైసమ్మ సన్నిధిలో శాసనసభ స్పీకర్‌

మైసిగండి మైసమ్మ సన్నిధిలో శాసనసభ స్పీకర్‌

కడ్తాల్‌: మండల పరిధిలోని మైసిగండి మైస మ్మ దేవాలయాన్ని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు నిర్వాహకులు శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్‌ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక సిబ్బంది, నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శిరోలీ, ఈవో స్నేహలత, సిబ్బంది, నిర్వాహకులు పాల్గొన్నారు.

సంచార చేపల విక్రయ వాహనం అందజేత

ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామానికి చెందిన వరలక్ష్మికి మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి సోమవారం సంచార చేపల విక్రయ వాహనం అందజేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రుల చేతుల మీదుగా ఆమె వాహనం కీ అందుకున్నారు. కార్యక్రమంలో డీపీఎం నర్సింహ, ఐకేపీ ఏపీఎం రామస్వామి, సీసీ లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

‘లక్ష్మీదేవిపల్లి’

పనులు చేపట్టాలి

షాద్‌నగర్‌రూరల్‌: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పాలమూరు అధ్య యన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా లక్ష్మీదేవిపల్లి పనులు చేపట్టలేదని, రిజర్వాయర్‌ నిర్మాణాన్ని మాటలకే పరిమితం చేస్తోందని విమర్శించారు. ఏదుల డిండి పథ కానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.1,832 కోట్లు కేటాయించి నల్లగొండకు నీళ్లు తరలించే యత్నం చేస్తోందని, రూ.232 కోట్లతో ఎస్‌ఎల్‌వీసీ కాలువకు లైనింగ్‌ పనులు చేపడుతోందని, లక్ష్మీదేవిపల్లిని మాత్రం పట్టించుకోవడంలేదన్నారు. గత పాలకులు ప్రాణహిత చేవెళ్ల రీడిజైన్‌లో చేవెళ్ల లేకుండా, పాలమూరు రంగారెడ్డి రీడిజైన్‌లో లక్ష్మీదేవిపల్లి లేకుండా చేశారని అన్నారు. పాలమూరు రంగారెడ్డిని నల్లగొండకు పంపకుండా జూరాల నుంచి నీటిని తెచ్చి లక్ష్మీదేవిపల్లిలో కలపాలని డిమాండ్‌ చేశారు. ప్రజాప్రయోజనాల కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఓటువేసేందుకు ఎంపీలు ముందుకు రావాలని కోరారు.సమావేశంలో రవీంద్రనాథ్‌, నర్సింలు, రామారావు, తిరుమలయ్య, అర్జునప్ప, జైపాల్‌రెడ్డి, ఖాజాషబ్బీర్‌ పాల్గొన్నారు.

సీబీఐ విచారణను స్వాగతిస్తున్నాం: ఈటల

కంటోన్మెంట్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణను సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కంటోన్మెంట్‌ నియోజకవర్గం మారేడుపల్లిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన కాళేశ్వరం నివేదికపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్‌ నివేదిక తప్పుల తడక అని ప్రభుత్వానికి తెలుసన్నారు. దీన్నుంచి తప్పించుకోవడానికే సీబీఐకి అప్పగించిందని పేర్కొన్నారు. సీబీఐ సంపూర్ణంగా విచారణ చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తుందనే విశ్వాసం తనకుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement