
అభయహస్తం
సంక్షేమ పథకాల అమలుపై దృష్టిసారించిన ప్రభుత్వం
● ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పనులు వేగిరం ● చురుగ్గా రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ● మహిళలకు ఉచిత ప్రయాణం, సబ్సిడీపై సిలిండర్లు ● స్థానిక నేతల‘అభివృద్ధి పర్యటనలు’
వికారాబాద్: స్థానిక ఎన్నికలకు కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సంక్షేమంపై ఫో కస్ పెట్టింది. అభయహస్తం హామీలో భాగంగా ఆరు పథకాలపై దృష్టిసారించింది. ప్రధానంగా రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఉచిత విద్యుత్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి వాటిపై ప్రత్యేక నజర్ పెట్టింది. వీటిని లబ్ధిదారులకు అందించే పనుల్లో యంత్రాంగం తలమునకలైంది. భూభారతి సమస్యల పరిష్కారంపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆయా శాఖల హెచ్‌ఓడీలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు స్పీకర్ ప్రసాద్‌కుమార్‌తో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క, పొంగులేటి, కొండా సురేఖ, చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి జిల్లాలో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. స్థానిక పోరులోబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
22,503 కొత్త కార్డులు
ప్రజా పాలన కార్యక్రమంతో పాటు ఆన్‌లైన్‌లో 35వేల పైచిలుకు కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిపై క్షేత్ర స్థాయి విచారణ చేపట్టిన అధికారులు అర్హుల జాబితాను ప్రభుత్వానికి అందించారు. ఇప్పటి వరకు 22,503 కుటుంబాలకు ప్రభుత్వం కార్డులు మంజూరు చేసింది. దీనికితోడు పాత కార్డులలో కొత్త సభ్యుల వివరాల నమోదు, తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 70,685 కొత్త సభ్యులు రేషన్ కార్డుల్లో చేరారు. జిల్లాలో మొత్తం 2,75,224 రేషన్ కార్డుల ద్వారా 9,91,562 మంది సభ్యులకు సన్న బియ్యం సరఫరా అవుతున్నాయి.
11,785 ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ పేరుతో రూ.5 లక్షల నిధులతో ప్రభుత్వం పేదలకు ఇళ్లు మంజూరు చేస్తోంది. తొలి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో 11,785 గృహాలకు మంజురు పత్రాలు అందజేయగా 5,506 ఇళ్లకు హౌసింగ్ అధికారులు మార్కింగ్ చేశారు. వీటిలో 605 బేస్మెట్ లెవెల్, 70 రూఫ్‌లెవల్‌లో ఉండగా 25 ఇళ్లకు స్లాబ్ పనులు పూర్తి చేశారు. ఆయా స్థాయిలలో 438 మంది లబ్ధిదారులకు నిధులు విడుదలయ్యాయి.
1,16,990 గ్యాస్ కనెక్షన్లు
జిల్లాలో మొత్తం 2,08,553 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో జనరల్ కనెక్షన్లు 19,358 (డబుల్), 69,902(సింగల్), 3,209 కమర్షియ ల్, 35,193 దీపం, 38,753 ఉజ్వల్, 21,260 సీఎస్‌ఆర్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో తెల్ల రేషన్ కార్డు కలిగిన 1,16,990 మందికి మహాలక్ష్మి పథకం కింద రూ.500 సిలిండర్ అందుంతోంది.
మహిళలకు ఉచిత ప్రయాణం..
జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్ డిపోల పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. మూడు డిపోల్లో కలిపి ఇప్పటివరకు 3.98 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఇందుకుగానూ ప్రభుత్వం రూ.142 కోట్లు ఖర్చు చేసింది.
రైతుకు భరోసా...
జిల్లాలోని మొత్తం 539 రెవెన్యూ గ్రామాలు, 20 మండలాల పరిధిలో 3,18,447 మంది రైతులు ఉన్నారు. వీరికి ఏడాదికి ఎకరానికి రూ.12,000 చొప్పున రైతు భరోసా నిధులు జమచేస్తోంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎకరానికి రూ.6 వేల చొప్పున 2,71,785 మంది రైతులకు రూ.358,17,08, 533 ఖాతాల్లో జమచేసింది.
నిరంతర ప్రక్రియ
ప్రభుత్వ పథకాల అ మలు నిరంతర ప్రక్రి య.అర్హులైన వారికి రే షన్ కార్డులు, ఇందిర మ్మ ఇళ్లు,గృహజ్యోతి, ఆర్టీసీ ఉచిత ప్రయా ణం తదితర పథకాలన్నీ అందుతాయి. దర ఖాస్తు చేసుకున్న వెంటనే క్షేత్ర స్థాయి అధికారులతో విచారణ పూర్తి చేయించి, లబ్ధిదారులకు అందేలా చూస్తున్నాం.
– ప్రతీక్‌జైన్, కలెక్టర్

అభయహస్తం