
‘ప్రజావాణి’కి119 ఫిర్యాదులు
అనంతగిరి: ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 119 అర్జీలు వచ్చాయని తెలిపారు. వీటిని పెండింగ్‌లో ఉంచకుండా వెంటవెంటనే క్లియర్ చేయాలని సూచించారు. ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్‌ఓ శ్రీనివాస్ వినతులను స్వీకరించారు.
ఫొటో షూట్‌కు వెళ్తుండగా కారు బోల్తా
స్వల్ప గాయాలతో బయటపడిన
ఫొటో, వీడియోగ్రాఫర్లు
ధారూరు: ఓ ఈవెంట్ ఫొటో షూట్‌కు వెళ్తున్న ఫొటో, వీడియో గ్రాఫర్ల కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటన మండల పరిధిలోని సోమ శంకరప్ప ఆలయ రోడ్డు మలుపులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ నుంచి తాండూరుకు వెళ్తున్న ఫొటో గ్రాఫర్ల కారు శంకర్ప ఆలయ సమీపంలోని ఓ మూల మలుపు వద్దకు రాగానే తాండూరు నుంచి రెండు లారీలు వేగంగా వస్తున్నాయి. దీంతో భయంతో కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు రోడ్డుకు కుడివైపు ఉన్న గుంతలోకి పడిపోయింది. అక్కడ ఫారెస్ట్ అధికారుల తవ్వించిన మట్టికుప్పలు ఉండడంతో వాహనం ఆగిపోయింది. పక్కనే ఉన్న ఆర్‌అండ్‌బీ హద్దురాయిని ఢీకొడితే మాత్రం ప్రమాద తీవ్రత పెరిగేదని స్థానిక సాక్షులు తెలిపారు.