
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
కడ్తాల్: విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీఎస్ యూటీఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్ అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోమవారం కడ్తాల్ మండల పరిధి పాఠశాలల్లో ఉపాధ్యాయులతో చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం సామాజిక స్పృహ కలిగిన సంఘానికి మద్దతు ప్రకటించాలని టీచర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీచర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు, హెల్త్‌కార్డు సమస్యలను పరిష్కరించాలని, డీఏలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో దశల వారీగా ఆగస్టు 1న జిల్లా కేంద్రంలో, 23న ఇందిరాపార్కు వద్ద ధర్నా, నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి శంకర్‌నాయక్, నాయకులు సత్యనారాయణ, రాజు, బీరప్ప, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్‌జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్