
మైసమ్మ సన్నిధిలో అచ్చంపేట ఎమ్మెల్యే
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవతను ఆదివారం ఉదయం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు తీర్థ ప్రసాదం అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ నరేశ్‌నాయక్, సింగిల్‌విండో డైరెక్టర్ వెంకటేశ్, నాయకులు జవహర్‌లాల్, హీరాసింగ్, తులసీ రాంనాయక్, మహేందర్‌గౌడ్ ఉన్నారు.
గెస్ట్ అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
చేవెళ: మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో గెస్ట్ అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంచనలత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హిస్టరీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బోధనకు దరఖాస్తులు కోరుతున్నటు తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ పొంది ఉండాలని చెప్పారు. జనరల్ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు 50 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. అనుభవం, పీహెచ్‌డీ లాంటి అదనపు అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్థులు సంబంధిత జిరాక్స్ ధ్రువపత్రాలతో కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి
తుర్కయంజాల్: దేశంలో ఆర్థిక అసమానతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, సామాజిక అభివృద్ధి కుంటుపడి పోతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ మున్సిపాలిటీ రెండో మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసమానతలు లేని సమాజం కోసం పుట్టిందే ఎర్రజెండా అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో పేదలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, దేశంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య మత విద్వేషాలతో చిచ్చు పెడుతోందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ కంట్రోల్ కమిషన్ సభ్యుడు పుస్తకాల నర్సింగ్ రావు, రాష్ట్ర సమితి సభ్యులు ఓరుగంటి యాదయ్య, కావలి నర్సింహ, పానుగంటి పర్వతాలు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు నీలమ్మ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి.శివ కుమార్ గౌడ్ తదితరులు పాల్గోన్నారు.
మొక్కలతోనే
మానవ మనుగడ
పరిగి: నేడు నాటిన మొక్క రేపటి తరానికి మేలు చేస్తుందని పరిగి సబ్‌జైల్ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం పతి ష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవంలో భాగంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పరిగి పరిసర ప్రాంతాల్లో 200 సీడ్‌బాల్స్ చల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీడ్ బాల్స్ చల్లడంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కలను నాటే వీలుంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జైళ్ల శాఖ ఇప్పటి వరకు 2 లక్షల సీడ్‌బాల్స్ తయారు చేసి చల్లా మన్నారు. జైళ్ల శాఖ పెట్రోల్ బంక్‌ల్లో సీడ్‌బా ల్స్‌ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ప్రతీ ఒక్కరూ చల్లాలని సూచించారు. కార్యక్రమంలో జైలు సిబ్బంది పాల్గొన్నారు.

మైసమ్మ సన్నిధిలో అచ్చంపేట ఎమ్మెల్యే