
డిమాండ్లు పరిష్కరించాలి
అబ్దుల్లాపూర్‌మెట్: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పంచాయతీ కార్యదర్శుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హయత్‌నగర్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆదివారం సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 నెలలుగా పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న చెక్కులను వెంటనే విడుదల చేయడంతో పాటు కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ పెంపుదలను వేగవంతం చేయాలన్నారు. ఔట్‌సోర్సింగ్ విధానా న్ని రద్దు చేస్తూ ఓపీఎస్‌లను వెంటనే క్రమబద్ధీకరించాలని, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగు సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకుంటూ పదోన్నతులు కల్పించాలని కోరా రు. జీఓ నం.317 ద్వారా నష్టపోయిన పంచా యతీ కార్యదర్శులను వారి సొంత జిల్లా లేదా జోన్‌లకు బదిలీ చేయాలని, మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ విధానంలో నియమించిన కార్యదర్శులకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ.శ్రీనివాస్, కోశాధికారి పండరినాథ్, రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ జిల్లాలకు చెందిన సంఘం జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి