
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
అబ్దుల్లాపూర్‌మెట్: నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు కీలక భూమిక పోషిస్తాయని ఏసీపీ కాశిరెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధి ఇనాంగూడ గ్రామం కార్తీక్‌హోమ్స్ ఫేస్– 2లో 16 సీసీ కెమెరాలనుసీఐ అశోక్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ నివాస, వ్యాపార, వాణిజ్య, విద్యాలయాల్లో కెమెరాలను విధిగా ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. అనంతరం మత్తు పదార్థాలు, సైబర్ నేరాలు, షీటీం, డయల్ 100 తదితర వాటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యడు ఊషయ్యగౌడ్, మాజీ సర్పంచ్ యశోద, ఎస్‌ఐ బద్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.