
యజుర్వేద పారాయణ కరపత్రాల ఆవిష్కరణ
కొందుర్గు: చౌదరిగూడ ఆర్య సమాజంలో శ్రావణమాసంలో నిర్వహించనున్న యజుర్వేద పారాయణ యజ్ఞం కరపత్రాలను సభ్యులు ఆదివారం ఆవిష్కరించారు. సమాజహితం కోసం గత 45 ఏళ్లుగా ఆర్య సమాజం ఆధ్వర్యంలో యజుర్వేద పారాయణ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఆగస్టు 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు యజ్ఞం చేపడుతున్నామని సంఘం ప్రతినిధి మచ్చ సుధాకర్‌రావు వివరించారు. యజ్ఞబ్రహ్మలుగా అరవింద్‌శాసీ్త్ర, వసుదాశాసీ్త్రలు వ్యవహరిస్తారని, ఆకారపు సుమతమ్మ, యాదగిరి దంపతులు భక్తులకు భోజన వసతి కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.