
నేడు ఎమ్మెల్యే రంగారెడ్డి పర్యటన
ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సోమవారం ఇబ్రహీంపట్నం మండలంలో పర్యటించనున్నారు. నెర్రపల్లి, పోచారం, ఎల్మినేడు, కప్పపహాడ్, తుర్కగూడ, చర్లపటేల్‌గూడ, కర్ణంగూడ గ్రామాల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పట్నంలోని శాస్త్ర ఫంక్షన్‌హాల్‌లో మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో పాల్గొని, వడ్డీలేని రుణాలు, బీమా, యాక్సిడెంట్ బీమా చెక్కులను అందజేయనున్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
తుర్కయంజాల్: పురపాలక సంఘం ఇంజాపూర్‌లోని శాంతివనం కాలనీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డి.కిరణ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా శివ ప్రసాద్ రాజు, కోశాధికారిగా మెగావత్ గణేశ్, ప్రధాన కార్యదర్శిగా ఫణిందర్, కార్యదర్శిగా రాజు నాయక్, గౌరవ అధ్యక్షుడిగా నరసింహా రెడ్డిని నియమించారు. అనంతరం నూతన సభ్యులను కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు.
ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు
ఇన్‌చార్జి తహసీల్దార్ సంతోష్
ఆమనగల్లు: ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తలకొండపల్లి ఇన్‌చార్జి తహసీల్దార్ సంతోష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఖానాపూర్ గ్రామ శివారులో సర్వే నంబర్ 252, 256,253,1,39,42,22,18,38లో 64 ఎకరాల 19 గుంటల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. ఆ జాగకు సంబంధించి కాంక్రిట్ పిల్లర్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎవరైన ఆ భూమిని చదును చేసినా, ఆక్రమించేందుకు యత్నించినా, కాంక్రీట్ పిల్లర్స్ తొలగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సీపీఐ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా రాజు
తుర్కయంజాల్: సీపీఐ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఇంజాపూర్‌కు చెందిన అనంతుల కాటంరాజు గౌడ్‌ను ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన ఆ పార్టీ మహాసభల్లో రాజును నియమించామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకులజంగయ్య పేర్కొన్నారు.
వర్షానికి కూలిన ఇల్లు
మాడ్గుల: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఓ ఇల్లు కూలింది. ఈ సంఘటన మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఉన్న ఇల్లు కూలి రోడ్డున పడ్డానని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితురాలు అరుణమ్మ కోరారు.
దివ్యాంగులను ఆదుకోవాలి
కడ్తాల్: దివ్యాంగులు, చేయూత పెన్షన్ దారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలం మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నిస్సహాయ స్థితిలో ఉండి కేవలం పింఛన్ మీదనే ఆధారపడి జీవిస్తున్న వారికి ఆసరా అందజేసి ఆదుకోవాలని కోరారు. పెన్షన్ దారుల హక్కుల సాధన కోసం ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఆమనగల్లులో నిర్వహించే దివ్యాంగుల, చేయూత పెన్షన్ దారుల ఆవేదన జిల్లా సన్నాహక సదస్సుకు.. సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రానున్నారని తెలిపారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు,ఒంటరి మహిళలు, గీత, బీడీ, నేత కార్మికులు, చేయూత పెన్షన్ దారులు తరలివచ్చి సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

నేడు ఎమ్మెల్యే రంగారెడ్డి పర్యటన

నేడు ఎమ్మెల్యే రంగారెడ్డి పర్యటన

నేడు ఎమ్మెల్యే రంగారెడ్డి పర్యటన