
కులం పేరుతో దూషించిన వారిని శిక్షించాలి
తాండూరు టౌన్: ఎరుకల కుటుంబంపై దాడి చేసి, కులం పేరుతో దూషించిన వారిని అరెస్టు చేయాలని దళిత, ప్రజా, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. తాండూరు మండలం చెన్‌గేష్ పూర్ గ్రామానికిచెందిన ఎరుకలి శారద, బస్వరాజ్ కుటుంబంపై అదే గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్, నరేందర్ గౌడ్, నాని గౌడ్, నరేష్ గౌడ్, పవన్ గౌడ్‌లు అకారణంగా గత నెలలో దాడి చేశారని తెలిపారు. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకు అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. లేని పంక్షంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తమ పోరాటంలో భాగంగా ఈ నెల 4వ తేదీన ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దళిత, ప్రజాసంఘాల నాయకులు కె శ్రీనివాస్, చంద్రయ్య, నరేశ్, నవీన్ తదితరులుతెలిపారు.
సీఐటీయూ, దళిత,ప్రజాసంఘాల డిమాండ్
4న ఎస్పీ కార్యాలయం ముట్టడి