
బీసీ సంక్షేమ సంఘం ఎన్నిక
కందుకూరు: బీసీ సంక్షేమ సంఘం మండల నూతన కమిటీని జిల్లా అధ్యక్షుడు ఎగ్గిడి సత్తయ్య ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆదివారం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రాలను నూతన కమిటీకి అందజేశారు. అధ్యక్షుడిగా బండ ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా ఇంద్రకంటి రవీందర్‌గౌడ్, డేరంగుల శ్రీరాములు, శ్రీనివాస్‌గౌడ్, బొడ్డుపల్లి రవి, ప్రధాన కార్యదర్శులుగా జంగయ్య ముదిరాజ్, బాల్‌రాజ్, దామోదర్‌గౌడ్, కోశాధికారిగా శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా శేఖర్‌గౌడ్, కాళిదాసుచారి, బాబు, మహేందర్, శ్రీనివాస్‌చారి, ఎ.రమేష్‌గౌడ్, బి.రమేష్‌గౌడ్, నర్సింహ, ఎగ్గిడి కృష్ణ, నరేష్, వెంకటేశ్, జంగయ్య, రామకృష్ణ యాదవ్, శ్రీనివాస్ ముదిరాజ్, సురేందర్, ప్రచార కార్యదర్శులుగా వెంకటేశ్ గౌడ్, యాదయ్య ముదిరాజ్, లింగం యాదవ్, యాదయ్య, సీహెచ్ రవీందర్, అందె జైపాల్, బండ శ్రీను, మల్లేశ్, శంకర్, నర్సింహ, శివశంకర్, వరికుప్పల రాజు, ఢిల్లీ కృష్ణ, జగదీష్, సలహాదారులుగా బి.వెంకటేశ్, దేవేందర్, ఎస్.అంజయ్య, పి.వెంకటేశ్, ఎమ్మ అంజయ్య కుర్మలను నియమించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ఆర్.కృష్ణయ్య తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.