
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
కొందుర్గు: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం గాలిగూడలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన శ్రీశైలం అనే రైతు తన పొలంలో విద్యుత్ తీగలు సరిచేయాలని లైన్‌మన్ చెన్న య్యకు సమాచారం అందించాడు. ఇందుకోసం ఎల్‌సీ తీసుకోమని సూచించాడు. ఎల్‌సీ ఇచ్చినట్లు చెప్పగానే ఇదే గ్రామానికి చెందిన కాత్రమోని నర్సింలు(46)ను కరెంటు స్తంభం ఎక్కించాడు. పనులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ రావడంతో నర్సింలు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. ఎల్‌సీ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయిన లైన్‌మన్ సబ్ స్టేషన్‌నుంచి సరఫరాకు అనుమతించడంతోనే ప్రమాదం జరిగిందని శ్రీశైలం ఆరోపించాడు. మృతుడికి భార్య, ముగ్గరు పిల్లలు ఉన్నారని, వీరికి న్యాయం చేయాలని బాధితులు సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. లాల్‌పహాడ్ చౌరస్తాలో షాద్‌నగర్– పరిగి రోడ్డుపై బైఠాయించారు. అక్కడికి చేరుకున్న చౌదరిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ విషయమై ఎస్‌ఐ విజయ్‌ని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. నర్సింలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.
● మరొకరికి గాయాలు
● పొలం వద్ద
తీగలు సరిచేస్తుండగా ప్రమాదం