
ఉన్నత చదువుతోనే ఉజ్వల భవిష్యత్
షాద్‌నగర్‌రూరల్: ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ శోభారాణి అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మూన్రే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్(ఎంఐపీఎస్) కళాశాలలో బుధవారం మిప్స్కాన్–2025 జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ శోభారాణి హాజరై జ్యోతి ప్రజ్వలనచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రణాళికను రూపొందించుకొని నిరంతరం లక్ష్య సాధనకోసం శ్రమించాలని సూచించారు. సాధించాలనే కృషి, పట్టుదల ఉంటే విజయాలు వెన్నంటే ఉంటాయన్నారు. విద్యార్థులు తమ మేధస్సుకు పదునుపెట్టి తాము ఎంచుకున్న రంగాలలో ఘనవిజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. షాద్‌నగర్ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా వెలుగొందుతుందని, ఉత్తమ ఫలితాలను సాధించే విద్యారులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పారు. అనంతరం కళాశాల చైర్మన్ పర్వత్‌రెడ్డి మాట్లాడుతూ.. 2007లో 60 మంది విద్యార్థులతో ప్రారంభమైన కళాశాల అంచెలంచలుగా ఎదిగి ఎందరో విద్యార్థులకు ఉపాధి అవకాశాలను అందించిందని అన్నారు. అనంతరం ప్రొఫెసర్ డాక్టర్ శోభారాణిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సాయికృష్ణ, ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ డాక్టర్ శోభారాణి