
నోటీసులిచ్చారు.. న్యాయం చేయండి
షాబాద్: ప్రభుత్వ భూమి నుంచి మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని సోలిపేట్ రైతులు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 350 సర్వేనంబర్‌లోని భూమిని ప్రభుత్వం పలువురికి అసైన్ చేసిందని తెలిపారు. ఇందులో నుంచి అక్రమార్కులు మట్టి తరలించి, సొమ్ము చేసుకున్నారన్నారు. ఈ విషయం తెలియడంతో రెవెన్యూ అధికారులు రైతులకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. దీనిపై స్పందించిన మధుసూదన్‌రెడ్డి చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. బాధిత రైతుల వెంట జనార్దన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, కుమ్మరి విఠల్ తదితరులు ఉన్నారు.