
రైతు సంక్షేమమే లక్ష్యం
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
మొయినాబాద్/మొయినాబాద్ రూరల్: రైతు సంక్షేమమే లక్ష్యమని, ప్రభుత్వం ఇందుకు కట్టుబడి ఉందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డితో కలిసి మంగళవారం ఎన్కేపల్లి భూ బాధితులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చెందిన 99.14 ఎకరాల భూములను కొన్నేళ్లుగా ఎన్కేపల్లి రైతులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ స్థలాన్ని ప్రభుత్వం గోశాలకు కేటాయించడంతో.. 53 మంది నిర్వాసితులకు 300 గజాల చొప్పున ప్రొవిజినల్ అలాట్‌మెంట్ పట్టాలు మంజూరు చేసిందని స్పష్టంచేశారు. దీంతో పాటు గోశాలలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం, ప్రభుత్వం అందజేసిన ప్లాటులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అంగీకరించిందని తెలిపారు. అనంతరం 26 మందికి పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ వినోద్‌కుమార్, మండల అభివృద్ధి అధికారి సంధ్య, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, నాయకులు దర్శన్, అమర్‌నాథ్‌రెడ్డి, హన్మంత్‌యాదవ్, కాలె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్కేపల్లి భూ నిర్వాసితులకు ప్లాట్ల పట్టాల పంపిణీ బీఆర్‌ఎస్ ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు రైతులు, పోలీసుల మధ్య తోపులాట