
నేడు శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025
సమస్యలు వింటున్నమున్సిపల్ కమిషనర్ వెంకటేశం
శంకర్‌పల్లి: మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ ఎ.యోగేశ్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆయా వార్డుల్లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
చేవెళ్ల: అందరికీ అందుబాటులో ఉంటూ.. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ.. మున్సిపాలిటీని అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటేశం అన్నారు. మున్సిపల్ పరిధిలో సమస్యలు.. పరిష్కార మార్గాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘ఫోన్ ఇన్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను స్థానికులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. వాటిని సావధానంగా ఆలకించిన ఆయన వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రశ్న: మల్కాపూర్ వార్డుకు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. నీటి సమస్య ఉంది. చెత్త సేకరణ సక్రమంగా చేయడం లేదు.
– గోపాల్‌రెడ్డి, వెంకటేశ్, మాణిక్యరెడ్డి (మల్కాపూర్)
కమిషనర్: పారిశుద్ధ్య, నీటి సమస్యలు వెంటనే పరిష్కరించేలా అధికారులను ఆదేశిస్తా. రోడ్డు సమస్యకు సంబంధించి నిధులు వచ్చిన వెంటనే పరిష్కారం అవుతుంది.
ప్రశ్న: మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ సమస్యలు ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు లేక ఇబ్బంది ఏర్పడుతోంది. టెంపుల్ కమాన్ వద్ద ఎప్పుడూ వర్షపు నీరు నిలువ ఉంటోంది. వచ్చిపోయే వారికి ఇబ్బందిగా మారింది. ఏ సమస్యకు ఎవరిని సంప్రదించాలో తెలియజేస్తే బాగుంటుంది.
– బురాన్ ప్రభాకర్ (హౌసింగ్‌బోర్డు కాలనీ)
జవాబు: ఆయా సమస్యలపై తక్షణమే చర్యలు చేపడతాం. మీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం. మున్సిపల్ పరిధిలోని అధికారుల వివరాలను ప్రత్యేకంగా సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసి ప్రజలకు తెలిసేలా చూస్తాం.
ప్రశ్న: ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాం. దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్‌ఓసీ వచ్చింది. ఎఫ్‌టీఎల్ అని డ్యాక్యుమెంట్ పెండింగ్ అంటూ సమస్యలు వస్తున్నాయి.
– మంగలి నర్సింలు, రంగారెడ్డి (దేవునిఎర్రవల్లి), జనార్దన్‌రెడ్డి (పలుగుట్ట), ఎం.డీ.ఇబ్రహీం (కిష్టారెడ్డినగర్), శ్రీనివాస్‌రెడ్డి (ఇంద్రారెడ్డినగర్)
జవాబు: టెక్నికల్‌గా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి పైనుంచి క్లియర్ చేయాల్సి ఉంది. మా పరిధిలో ఉన్నవాటిని పెండింగ్‌లో లేకుండా చూస్తున్నాం. టౌన్ ప్లానింగ్ అధికారి ద్వారా సమస్యలు పరిష్కరించేలా చూస్తాం.
ప్రశ్న: వీధిలైట్లు వెలగడం లేదు. చెత్త సేకరణ సిబ్బంది రావడం లేదు. డ్రైనేజీ తరచూ జామ్ అవుతున్నా పట్టించుకోవడం లేదు. సీసీ రోడ్డు లేక ఇబ్బందులు ఉన్నాయి.
– సుశాంత్, వై.శ్రీనివాస్, ఎండీ నసీర్‌ఖాన్ (రంగారెడ్డి కాలనీ)
జవాబు: సిబ్బందిని పంపించి సమస్యలను పరిశీలిస్తాం. త్వరలోనే వాటిని పరిష్కరిస్తాం.
ప్రశ్న: నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. జాబితాలో పేరు వచ్చింది కానీ ప్రొసీడింగ్ ఇవ్వలేదు. ఇల్లు కట్టుకోవచ్చా.
– ఎండీ చాన్‌పాషా (ఇబ్రహీంపల్లి)
జవాబు: ఇల్లు మంజూరైతే తప్పకుండా ప్రొసీడింగ్ వచ్చి ఉండాలి. ఎందుకు రాలేదో తెలుసుకుంటాను. మీరు కూడా మరోసారి చెక్ చేసుకోండి. రాకపోతే తప్పకుండా ఇప్పిస్తాం.
ప్రశ్న: మా వార్డులో వీధి లైట్లు వెలగడం లేదు. ఇనుప స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయి. గేట్ నుంచి రోడ్డు గుంతలమయంగా మారింది. రాత్రిళ్లు ప్రయాణం ఇబ్బందిగా ఉంది.
– రజినీకాంత్ (దామరగిద్ద)
జవాబు: మీ వార్డులో ఇటీవలే పర్యటించాను. సమస్యలు దృష్టికి వచ్చాయి. ఇనుప స్తంభాలు తొలగించే చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు మరమ్మతులపై సంబంధిత అధికారులకు నివేదిస్తాం.
ప్రశ్న: మా వార్డులో వీధి లైట్లు వెలగడం లేదు. సీసీ రోడ్లు లేవు.
– రాంచందర్, గీత (గ్రీన్ సిటీ)
జవాబు: సమస్యలు నోట్ చేసుకున్నాం. పరిశీలించి చర్యలు చేపడతాం.
ప్రశ్న: మెయిన్‌రోడ్డుపై డ్రైనేజీ లేక ఇబ్బందులు ఉన్నాయి. లేబర్ గుడిసెలు వేసుకొని కాలనీలను అపరిశుభ్రం చేస్తున్నారు.
– కృష్ణ, రాజు (వీరభద్రకాలనీ)
జవాబు: సమస్యలు ఉన్న కాలనీల్లో పర్యటించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం.
ప్రశ్న: డ్రైనేజీ సమస్య ఎక్కువైంది. నిత్యం లీకవుతోంది.
– సత్యనారాయణ, అమీర్ (భగత్‌సింగ్‌కాలనీ)
జవాబు: పరిశీలన చేసి పరిష్కరిస్తాం.
ప్రశ్న: వార్డులో రోడ్డు సమస్య ఉంది. తాగునీరు రావడం లేదు. జంగంగుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో చెత్త డంపింగ్ చేస్తుండడంతో నీళ్లు కలుషితం అవుతున్నాయి.
– చంద్రశేఖర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి (పలుగుట్ట)
జవాబు: రోడ్డు సమస్యను సంబంధిత అధికారులకు నివేదిస్తాం. డంపింగ్ యార్డు కోసం స్థల అన్వేషణ చేస్తున్నాం.
ప్రశ్న: వారం రోజులుగా కరెంట్ సమస్యతో నీళ్లు రావడం లేదు. వీధి లైట్లు వెలగడం లేదు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు.
– మాల్లారెడ్డి, శ్రీకాంత్, వెంకటేశ్ (పామెన)
జవాబు: వార్డులో తప్పకుండా పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తాం. కరెంట్ సమస్యపై విద్యుత్ అధికారులకు సమాచారం ఇస్తాం.
ప్రశ్న: కుక్కల బెడద, కోతుల బెడద ఎక్కువ అవుతోంది.
– రవీందర్ (హౌసింగ్ బోర్డు కాలనీ)
జవాబు: మున్సిపల్ పరిధిలో ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా గుర్తించి ఏం చేయాలో నిర్ణయిస్తాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
ఫోన్ చేయాల్సిన నంబర్:
73311 27776, 96764 84485
ప్రజల సమస్యలను నమోదు చేసుకుంటున్న సిబ్బంది
న్యూస్‌రీల్

నేడు శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’

నేడు శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’

నేడు శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’

నేడు శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’