
ప్రభుత్వానిది భూ దందా
మొయినాబాద్: భూ దందా చేయడానికే ప్రభుత్వం పేదల భూములు గుంజుకుంటోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్‌గౌడ్ ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లిలో ధర్నా చేస్తున్న రైతులకు గురువారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోశాలకు ఇవ్వడానికి ప్రభుత్వానికి పేదలు సాగుచేసుకునే భూములే దొరికాయా..? ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి.. వాటిలో ఏర్పాటు చేస్తే ఏమవుతుంది అని ప్రశ్నించారు. కోకాపేటలో ఉన్న గోశాలను ఎనికేపల్లికి తరలించి అక్కడి భూములను ప్రభుత్వం అమ్మడానికి చూస్తోందన్నారు. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములను వదిలిపెట్టొద్దని.. రైతుల పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్‌వల్లి ప్రభాకర్‌రెడ్డి, కిసాన్ మోర్చ జిల్లా క్యాదర్శి మోర నర్సింహారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, నియోజకవర్గం కన్వీనర్ వెంకటేశ్‌గౌడ్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు క్యామ పద్మనాభం, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్‌గౌడ్