
వైభవంగా గురుపూర్ణిమ మహోత్సవం
కందుకూరు: గురువు సూచించిన మార్గంలో నడిస్తే భగవంతుడి కృప త్వరగా ప్రాప్తిస్తుందని బ్రహ్మశ్రీ గురూజీ అనిల్‌కుమార్‌జోషి అన్నారు. మండలంలో ని పులిమామిడి పరిధిలోని శ్రీనిఖిల్ చేతనా కేంద్రంలో గురువారం గురు పూర్ణిమ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి నిఖిలేశ్వరానంద విగ్రహానికి అభిషేకం, పాదుకా పూజలు చేశారు. అనంతరం గురూజీకి తులాభారం వేశారు. గురూజీ సాధకులతో ప్రత్యేకంగా సాధనలు చేయించి గురు పూర్ణిమ విశిష్టతను వివరించారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.