
టీఎన్జీవీఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక
కేశంపేట: తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ (టీఎన్జీవీఏ) జిల్లా ఎన్నికలు హైదరాబాద్ సీతరాంబాగ్‌లోని సంఘం రాష్ట్ర భవనంలో జరిగాయి. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బింగి సురేష్ అధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని 96 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా రాజీవ్ పైలెట్, కార్యదర్శిగా భరత్‌చారి, అసోసియేట్ అధ్యక్షుడిగా ఆనంద్, కోశాధికారిగా శివకుమార్ గెలుపొందారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాజీవ్ పైలెట్ మాట్లాడుతూ.. వెటర్నరీలో నాన్ గెజిటెడ్ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి అభిషేక్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ రతన్, ట్రెజరీ సుధాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.