
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
శంకర్‌పల్లి: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. గురువారం మండలంలోని పిల్లిగుండ్ల గ్రామ శివారులో యూత్ కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు మహిపాల్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేయగా.. నాగేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలను గడపగడపకూ చేరేలా చూడాలన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, పార్టీ ఇన్‌చార్జి పామెన భీంభరత్‌లతో సమన్వయం చేసుకుంటూ యువత ముందుకు సాగాలని కోరారు. యూత్ కాంగ్రెస్‌లో ఎవరికై నా సమస్యలు ఉంటే, జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి అరవింద్, అసెంబ్లీ ఇన్‌చార్జి వసీం, మండల అధ్యక్షుడు బొల్లారం ప్రశాంత్‌రెడ్డి, నాయకులు సంజయ్, దయాగౌడ్, నర్సింహారెడ్డి, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి