
నేడు చేవెళ్ల మున్సిపల్ కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025
8లోu
చేవెళ్ల: మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశంతో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆయా వార్డుల్లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పశువైద్యశాలల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పశువుల నిష్పత్తి మేరకు మందులు సరఫరా చేయకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రైతులు తమ పశువులను తీసుకుని ప్రైవేటు క్లినిక్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. సాధారణంగా పశువులు, గొర్రెలకు వైరస్, బ్యాక్టీరియా కారణంగా (కౌఫాక్స్, నీలినాలుక, గాలికుంటు, క్షయ, ఆంథ్రాక్స్, బ్లాక్ క్వార్టర్ (బ్లాక్ లెగ్), జోన్స్ డిసీజ్, ఫౌల్ టైఫాయిడ్, మాస్టిన్, బ్రూ సిల్లోసిస్(బాంగ్స్‌వ్యాధి, ఫుట్ రాట్) వంటి వ్యా ధులు వస్తుంటాయి. సీజన్ల వారీగా వచ్చే జబ్బు లను ముందే గుర్తించి, వ్యాధి నిరోధక టీకా వేయించాల్సి ఉంటుంది. నట్టల నివారణ మందును తా గించాల్సి ఉంది. కానీ మూడేళ్లుగా నట్టల నివారణ మందు సరఫరా కావడం లేదు. గొర్రెలు, మేకల రైతులే వాటిని సమకూర్చుకోవాల్సి వస్తోంది.
పది నెలలుగా నిలిచిన సరఫరా
పశు వైద్యుడు అందుబాటులో ఉన్న పశువైద్యశాలకు రూ.60 వేల విలువ చేసే 69 రకాల మందులు, అదే పూర్తిస్థాయి వైద్యుడు లేని ఒక్కో సబ్ సెంటర్‌కు రూ.40 వేల విలువ చేసే మందులు ప్రతీ మూడు మాసాలకోసారి సరఫరా చేయాల్సి ఉంది. చివరిసారిగా 2024 సెప్టెంబర్‌లో మందులు సరఫరా చేశారు. దీంతో సబ్‌సెంటర్లకు పంపిణీ చేయాల్సిన మందులను పశువైద్యుడు పని చేస్తున్న చోటే వినియోగిస్తున్నారు. అది కూడా వచ్చిన పశువులకు సగం సగం మందులతోనే సరిపెడుతున్నారు. పెన్సిలిన్, యాంటిబయాటిక్స్, పశువులకు ప్రథమ చికిత్స చేసేందుకు అవసరమైన సర్జికల్ స్పిరిట్ కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 87 సబ్‌సెంటర్లు ఉండగా, వీటిలో ఏ ఒక్క చోట మందులు లేవంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
మృత్యువాత పడుతున్న దూడలు
సాధారణంగా పశువుల్లో సీజన్‌తో సంబంధం లేకుండా ‘లంపీస్కిన్’వ్యాధి (ముద్ద చర్మవ్యాధి) సోకుతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి నియంత్రణకు సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ప్రత్యామ్నాయం లేక మేకలకు వాడే ‘గోట్‌ఫాక్స్’వ్యాక్సిన్‌నే పశువులకు ఇస్తున్నారు. ఇది ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాప్తి చెందుతుంది. తెల్లజాతి ఆవుల్లో ఎక్కువగా కన్పిస్తుంది. శరీరమంతా కురుపులు, నల్లని మచ్చలతో కన్పిస్తుంది. ఈ సమయంలో జ్వరం అధికంగా ఉంటుంది. వ్యాధి ముదిరితే పశువు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ఆవులకు వ్యాక్సిన్ వేయడం వల్ల అవి ప్రమాదం నుంచి బయటపడుతున్నాయి. కానీ వాటికి పుట్టిన దూడలు మాత్రం చనిపోతున్నాయి.
నట్టల నివారణకు మందు కరువే
మూడేళ్లుగా నట్టల నివారణ మందు సరఫరా కావడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న జీవాలను కాపాడుకునేందుకు రైతులు ప్రైవేటుగా మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. గొర్రెలు, మేకలకు గతంలో ఏటా నాలుగు సార్లు నట్టల నివారణ మందులు సరఫరా చేసేది. మూడేళ్లుగా సరఫరా నిలిచిపోయింది. సీజన్‌కు ముందు వ్యాక్సిన్ వేసి, నట్టల మందు తాగిస్తే జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. వ్యాక్సిన్ వేసినా.. నట్టల మందు తాగించకపోవడంతో జీవాలు జబ్బుబారిన పడుతుంటాయి. ఆవులు, దూడలకు టాబ్లెట్స్ ఇస్తున్నారు కానీ గొర్రెల, మేకలకు ఇవ్వడం లేదు. మార్కెట్లో లీటరు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఫోన్ చేయాల్సిన నంబర్:
73311 13243, 98665 07624
న్యూస్‌రీల్
వేధిస్తున్న వైద్యనిపుణుల కొరత
మూగజీవాలకు సత్వర వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం జిల్లాలో నాలుగు ఏరియా వెటర్నరీ, 46 ప్రాథమిక పశు వైద్యశాలలు, ఐదు మొబైల్ క్లినిక్స్ సహా మరో 87 సబ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కొత్తూరు, కనకమామిడి (వైద్యులు లివ్‌లో వెళ్లగా), మేకగూడ, ఆరుట్ల, కందుకూరు వైద్యులు (ఇన్‌సర్వీసు పీజీకి వెళ్లారు). పాల్మాకుల, ఇర్విన్‌లో వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమీప సెంటర్లలో పని చేస్తున్న వైద్యులు సేవలు అందిస్తున్నారు. వెటర్నరీ అసిస్టెంట్లకు ఇటీవల పదోన్నతులు కల్పించడంతో ఆయా పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం మెజార్టీ కేంద్రాల్లో వైద్యులకు సహాయకులు లేరు. అటెండర్లు లేని చోట వైద్యులే ఆ పని కూడా చేయాల్సిన దుస్థితి. సిబ్బంది కొరతతో నిర్దేశిత సమయంలో వ్యాక్సిన్లు వేయలేని పరిస్థితి.

నేడు చేవెళ్ల మున్సిపల్ కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’

నేడు చేవెళ్ల మున్సిపల్ కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’