
నిద్రలోనే మృత్యు ఒడికి
మొయినాబాద్: తలనొప్పిగా ఉందని టాబ్లెట్ వేసుకుని, కుర్చీలో కునుకు తీసిన ఓ వ్యక్తి నిద్రలోనే మరణించాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట మండలం వట్టినాగులపల్లికి చెందిన గోలియా శ్యామ్ సుందర్‌సింగ్(55) నాగిరెడ్డిగూడ రెవెన్యూలోని సుజాత స్కూల్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తలనొప్పిగా ఉందని టాబ్లెట్ వేసుకుని కుర్చీలో నిద్రపోయాడు. కొంత సేపటి తర్వాత తోటి ఉద్యోగులు నిద్రలేపే ప్రయత్నం చేయగా లేవలేదు. వెంటనే భాస్కర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కదులుతున్న కారు నుంచి మంటలు
కేశంపేట: కదులుతున్న వాహనంలో మంటలు వ్యాపించి ఓ కారు దగ్ధమైంది. ఈ ఘటన బుధవారం మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఫరూఖ్‌నగర్ మండలం గంట్లవెళ్లికి చెందిన మిద్దె కృష్ణయ్య తన షిఫ్ట్ డిజైర్ కారులో పాపిరెడ్డిగూడ శివారు నుంచి వెంచర్ రోడ్డ్డులో స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన కృష్ణయ్య వెంటనే కారు నుంచి దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో షాద్‌నగర్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్ మంటలార్పేసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
జీహెచ్‌ఎంసీ
కార్యాలయంలో బోనాలు
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో బుధవారం బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలోని అమ్మవారి దేవాలయాన్ని చూడముచ్చటగా అలంకరించారు.