
నిబంధనలు పాటించని క్లినిక్‌ల సీజ్
షాబాద్: వచ్చిరాని వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్‌ఎంపీపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న క్లినిక్‌లను సీజ్ చేశారు. అర్హత లేకున్న నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీలపై చర్యలు తప్పవని మండిపడ్డారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. షాబాద్‌లో నిర్వహిస్తున్న క్లినిక్‌లపై తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని తనిఖీ చేసేందుకు వెళ్లగా, అప్పటికే వారు మూసివేసి వెళ్లడంతో ఉన్నతాధికారుల ఆదేశానుసారం క్లినిక్‌లను సీజ్ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా క్లినిక్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట వైద్య సిబ్బంది ఉన్నారు.
కఠిన చర్యలు తప్పవు
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగేంద్రబాబు