ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ డిమాండ్ చేశారు. ఆమనగల్లు పట్టణంలోని ఎంఆర్‌సీ కార్యాలయంలో మంగళవారం ఎంఈఓ పాండుకు పీడీఎస్‌యూ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠశాలల్లో వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. సర్కారు బడులను బలోపేతం చేయకుండా విచ్చలవిడిగా ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అనిల్, సాయి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్