
ఉపాధి హామీ పనుల పరిశీలన
ఇబ్రహీంపట్నం: జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్డీ)లో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాల అధికారులు మంగళవారం మండలంలోని నెర్రపల్లి, దండుమైలారం గ్రామాలను సందర్శించారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను పరిశీలించారు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అఽధికారులు అభినేంద్రకుమార్, స్వాగత్ దాస్, ఎన్‌ఐసీ అధికారి అమిత్‌కుమార్, ఎన్‌ఐఆర్డీ అధికారులు ప్రసాద్, మోహిత్, వెస్లీ టీం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పోగ్రాం అధికారులు మురళి, సందీప్, అబేద్‌ఖాన్, రాజశేఖర్, జిల్లా గ్రామీణాభి వృద్ధి శాఖ నుంచి అడిషనల్ డీఆర్డీఓ సుభాషిణి, ప్రాజెక్ట్ డైరెక్టర్ చరణ్ గౌతమ్‌లతో కూడిన బృందం ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీఆ ర్డీఓ అఽధికారులు శ్వేత, సంధ్య, పరుశురాం, ఎంపీడీవో యెల్లంకి జంగయ్యగౌడ్, ఎంపీఓ రఘురాం, పంచాయతీ కార్యదర్శులు వీణా, శివకుమార్, ఏపీఓ తిరుపతిచారి తదితరులు పాల్గొన్నారు.