ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Jul 8 2025 7:12 AM | Updated on Jul 8 2025 7:12 AM

ఉపాధ్

ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

షాబాద్‌: టీజీడబ్ల్యూఆర్‌ఎస్‌ (బాలికల) ఆమనగల్లు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్‌ వినోల సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీజీటీ తెలుగు, పీజీటీ ఇంగ్లిష్‌, ఫిజికల్‌ సైన్స్‌, జేఎల్‌ బోటనీ, జేఎల్‌ ఫిజిక్స్‌లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 8న (మంగళవారం) డెమో క్లాసులు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సర్టిఫికెట్లు ఒక సెట్‌ జిరాక్స్‌ తీసుకొని పీఆర్‌ఆర్‌ కళాశాల షాబాద్‌లో హాజరు కావాలని పేర్కొన్నారు. వివరాలకు 79950 10617 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ప్రజావాణి అర్జీలను

పెండింగ్‌లో పెట్టొద్దు

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దని అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న ప్రజల నుంచి రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతిమాసింగ్‌ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఈ వారం రెవెన్యూ శాఖకు సంబంధించి 29, ఇతర శాఖలకు సంబంధించి 33, మొత్తం 62 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్‌ అధికారులు, మండల తహసీల్దారులు, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

ఇబ్రహీంపట్నం రూరల్‌ : తెలంగాణ అత్యంత వెనకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ (టీజీఎంబీసీడీసీ) హైదరాబాద్‌ ఆధ్వర్యంలో యువతీ యువకులకు వివిధ నైపుణ్యాలను పెంపొందించడానికి హైదరాబాద్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాఫ్ట్‌ స్కిల్‌, పర్సనాలిటీ డెవల్‌మెంట్‌, రెవెన్యూ బిల్డింగ్‌, కమ్యూనికేషన్‌ పౌండేషన్‌, మాక్‌ ఇంటర్వ్యూ, సెల్ప్‌కాన్ఫిడెన్స్‌, బిల్డింగ్‌, మెంటల్‌ వెల్బింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. 21 నుంచి 30 ఏళ్ల వయసు ఉండి, ఏదైనా డీగ్రీ పాసైన వారు అర్హులని చెప్పారు. ఈ నెల 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలన్నారు. 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్‌ కార్యాలయంలోని ఎంబీసీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో రావాలని సూచించారు.

అణగారిన వర్గాలకు అండగా ఉంటాం

షాద్‌నగర్‌రూరల్‌: అణగారిన వర్గాల ప్రజలకు ఎమ్మార్పీఎస్‌ అండగా ఉంటుందని రాష్ట్ర ప్రధాన క్యాదర్శి రాగల్ల ఉపేందర్‌ అన్నారు. సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయం ఎదురుగా జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దండోరా జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాగల్ల ఉపేందర్‌ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకోసం మందకృష్ణమాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమం ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ మండల ఇన్‌చార్జి భూషణ్‌, నాయకులు ప్రవీణ్‌, సురేష్‌, లింగం, వెంకటేశ్‌, యాదయ్య, దర్శన్‌, జంగయ్య, సుదర్శన్‌, సత్యం, దశరథ్‌, శివ, రాజు, మహేందర్‌, కృష్ణ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం 
1
1/1

ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement