
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం
అబ్దుల్లాపూర్‌మెట్: ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి 40 నెలలుగా అద్దె చెల్లించలేదంటూ సదరు యజమాని భవనానికి తాళం వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 17 సంవత్సరాలుగా ఓ ప్రైవేటు భవనంలో కొనసాగుతోంది. 40 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో విసుగు చెందిన యజమాని పిట్టల రాజుముదిరాజ్ సోమవారం ఉదయం ఆఫీసుకు తాళాలు వేశారు. తనకు రావాల్సిన అద్దె చెల్లించిన తర్వాతే తీస్తానని తేల్చిచెప్పారు. బ్యాంకు రు ణం తీసుకుని, భవనం నిర్మించానని, ఏళ్ల తరబడి అద్దె చెల్లించకపోతే ఈఎంఐలు ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె చెల్లింపు విఽషయంలో ప్రతీసారి అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఆఫీసు పని వేళల్లో సుమారు గంటన్నర పాటు తాళం వేయడంతో ఇటు అధికారులు, అటు ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బంది పడ్డారు. స్పందించిన స్థానిక సబ్ రిజిస్ట్రార్ సునీతారాణి పదిహేను రోజుల్లో డబ్బులు చెల్లించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాన ని హామీ ఇవ్వడంతో యజమాని కార్యాలయ తాళాలు తీశారు. తాళాలు వేశారన్న సమాచారం తెలుసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు భవన యజమానిని స్టేషన్‌కు తరలించి, కొద్ది సేపటి తర్వాత వదిలేశారు.