
అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక బస్సు సౌకర్యం
షాద్‌నగర్‌రూరల్: గురు పౌర్ణమిని పురస్కరించుకొని తమిళనాడులోని అరుణాచ ల క్షేత్రానికి వెళ్లే భక్తులకు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని డీఎం ఉష అన్నారు. డిపో కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడారు. అరుణాచల క్షేత్రంలో ఈనెల 10న గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ నెల 8న రాత్రి 7 గంటలకు షాద్‌నగర్ నుంచి బయలుదేరి 9న ఉద యం 6 గంటలకు కాణిపాకం చేరుకుంటుందని, దర్శనం అనంతరం అక్కడి నుంచి బయ లుదేరి సాయంత్రం 4 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌కు చేరుకుంటుందన్నారు. అక్క డి నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి అరుణాచల క్షేత్రానికి చేరుకుంటుందని వివరించా రు. 10న గిరిప్రదక్షిణ పూర్తయిన తరువాత సా యంత్రం 4 గంటలకు అక్కడి నుంచి బయలు దేరి 11న ఉదయం 5గంటలకు షాద్‌నగర్ డి పోకు చేరుకుంటుందని పేర్కొన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ. 3,600, పిల్లలకు రూ.2,400 నిర్ణయించడం జరిగిందన్నారు. టికెట్ బుకింగ్ కోసం 94409 19113, 9490021433, 91826 45281, 99592 26287 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.