
వాహనాల తనిఖీలు
యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం కుర్మిద్ద–మీర్‌ఖాన్‌పేట గ్రామాల మధ్యన రహదారిపై వాహనాల తనిఖీలు చేపట్టారు. సీఐ లిక్కి కృష్ణంరాజు రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. కార్లు, ఇతర వాహనాల్లో ఏం తరలిస్తున్నారో పరిశీలించారు. వాహనాలు నడిపే వారు, ఆర్‌సీ, లైసెన్స్‌లు కలిగి ఉండాలని సూచించారు. అతి వేగంతో ప్రమాదాలకు గురి కావద్దని చెప్పారు. రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ తేజంరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.