బంజారాహిల్స్‌లో వ్యభిచారం గృహంపై దాడి | - | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో వ్యభిచారం గృహంపై దాడి

Jun 12 2025 11:03 AM | Updated on Jun 12 2025 11:03 AM

బంజారాహిల్స్‌లో వ్యభిచారం గృహంపై దాడి

బంజారాహిల్స్‌లో వ్యభిచారం గృహంపై దాడి

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ పోలీసులతో కలిసి వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం వ్యభిచారం గృహంపై దాడి చేసి నిర్వాహకుడితో పాటు ఇద్దరు హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. మరో నలుగురు మహిళలను రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం... బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–12లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బంజారాహిల్స్‌ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచార గృహం నిర్వాహకుడు అనంతపురం జిల్లా కేశవరాయనిపేటకు చెందిన కుమ్మెత నరేందర్‌రెడ్డి, హౌస్‌ కీపింగ్‌ విధులు నిర్వర్తించే బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఆనంద్‌కుమార్‌, రాహుల్‌కుమార్‌లతో పాటు ముగ్గురు కస్టమర్లను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే నలుగురు మహిళలను రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు తరలించారు. వీరి నుంచి రూ.26,500 నగదు, ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement