
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి
శంకర్‌పల్లి: రాష్ట్రంలోని రైతులు ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసి, అధిక దిగుబడులు సాధించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషన్ సభ్యుడు రాములునాయక్ అన్నారు. గురువారం శంకర్‌పల్లి మండలం ఎర్వగూడ గ్రామంలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్నదాతలు అధిక లాభాలు పొందాలనే ఉద్దేశంతోనే వ్యవసాయశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో గ్రామగ్రామాన అవగాహన సమావేశాలను నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులను వాడాలని సూచించారు. శాస్త్రవేత్త శర్మ మాట్లాడుతూ.. రైతులు పంట మార్పిడిని అలవాటు చేసుకోవాలని, ఎప్పటికప్పు డు భూసార పరీక్షలు చేయించి, ఎరువులు వాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు లక్ష్మి, చేవెళ్ల ఏడీఏ సురేశ్ బాబు, శంకర్‌పల్లి ఇన్‌చార్జ్ వ్యవసాయాధికారి సురేశ్ బాబు, ఏఈఓ మనీషా, ఏఎంసీ మల్లేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
యూరియాను తగ్గించాలి..
షాబాద్: పంటల సాగులో యూరియా వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచుకోవాలని వ్యవసాయశాఖ సీనియర్ శాస్త్రవేతలు డాక్టర్ పి.సతీష్, శాస్త్రవేత్త డాక్టర్ డి.శిరీష, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ అన్నారు. పోలీపేట్, లక్ష్మారావుగూడ గ్రామాల్లో గురువారం రైతు ముంగిట్లో శాస్త్రవేతలు అవగావాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రజలకు అందించవచ్చని తెలిపారు. పంట మార్పిడిని పాటించాలని సూచించారు. పచ్చిరొట్ట సాగు ద్వారా ఎరువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాశాఖ అధికారి వెంకటేశం, ఏఈఓలు గీత, రాజేశ్వరి, కిరణ్మయి, వ్యవసాయ విద్యార్థులు ప్రవీణ్‌కుమార్, శ్రీను, అవనిజ, ఉమ తదితరులు పాల్గొన్నారు.
సేంద్రియ సాగుతో సత్ఫలితాలు
రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషన్ సభ్యుడు రాములు నాయక్
ఎర్వగూడలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’

ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి