
రేపు రౌండ్ టేబుల్ సమావేశం
తుక్కుగూడ: కుల గణన, ఓబీసీల భవిష్యత్ నిర్మాణం, సామాజిక నాయ్యం అనే ఆంశాలపై ఈనెల 10న నగరంలోని సోమాజిగూడ క్షత్రియ హోటల్‌లో ఉదయం 10:30 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్‌గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సహాయ మంత్రి నరేంద్ర కశ్యప్‌తో పాటు పలువురు వక్తులు హాజరవుతారని పేర్కొన్నారు.
దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న
ముఠా అరెస్టు
అంబర్‌పేట: దృష్టి చోరీలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల ముఠాను అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. డీఐ హఫీజుద్దీన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మోఘల్‌పురా సుల్తాన్‌షాహికి చెందిన సయ్యద్ ఆఫ్రీదిన్, షేక్ హమీదుద్దీన్, నసీమ్ బేగం, ఖయ్యూం సుల్తానా ముఠాగా ఏర్పడి దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ నెల 5న వారు అంబర్‌పేట తిరుమల నగర్‌లోని భవానీలాల్ జ్యూవెల్లరీ దుకాణానికి వచ్చారు. వృద్ధురాలైన ఖయ్యూం సూల్తానా తన ఒంటిపై ఉన్న బంగారు గాజులను తీసి ఇచ్చి వాటిపై డబ్బులు కావాలని కోరింది. వాటికి రూ.2 లక్షలు వస్తాయని చెప్పిన దుకాణ యజమాని డబ్బులు ఇచ్చేందుకు సిద్దపడి కౌంటర్‌లో నుంచి తీసి బయటపెట్టారు. బంగారాన్ని పరీక్షించేందుకు అతను లోపలి వెళ్లగానే వారు కౌంటర్ పై ఉన్న రూ.2 లక్షల నగదును తీసుకుని ఉడాయించారు. అదే సమయంలో బంగారాన్ని పరీక్షించిన యజమానికి అది నకిలీదిగా గుర్తించి బయటికి చూడగా సుల్తానాతో పాటు మిగతా వ్యక్తులు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2 లక్షలు నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.