
రెవెన్యూ సదస్సులు
ఎల్‌ఆర్‌ఎస్ రూ.255 కోట్లు ఎల్‌ఆర్‌ఎస్‌కు జిల్లాలో విశేష స్పందన లభించింది. ఫీజు చెల్లింపు కింద రూ.255 కోట్లు సమకూరాయి.
10లోu
సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025
షాద్‌నగర్/కొందుర్గు: భూ సంబంధిత సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో ధరణి పోర్టల్ అమలుతో నష్టపోయిన బాధితులు సంబంధిత కార్యాలయాలు, కో ర్టుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. ఈ క్రమంలో ప్ర స్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన భూ భారతి చట్టం వారిలో ‘కొత్త’ ఆశలు రేకెత్తిస్తోంది.
అధికారుల ప్రణాళిక
ప్రభుత్వ ఆదేశాల మేరకు షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని కొందుర్గు మండలాన్ని అధికారులు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఈనెల 5 నుంచి 16వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. మొదటి రోజు మహదేవ్‌పూర్‌లో సదస్సు ప్రారంభంకానుంది. మండల పరిధిలోని 20 గ్రామాల్లో నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు.
రెండు బృందాల ఏర్పాటు
సదస్సుల నిర్వహణకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. మొదటి బృందంలో కొందుర్గు తహసీల్దార్ రమేష్‌కుమార్, ఆర్‌డీఓ కార్యాలయం డీటీ, కొందుర్గు ఎంఆర్‌ఐ, సర్వేయర్‌తో పాటు తొమ్మిది మంది అధికారులు ఉంటారు. రెండో బృందంలో జిల్లేడు చౌదరిగూడ మండల తహసీల్దార్ జగదీశ్వర్‌తో పాటు ఎంఆర్‌ఐ, ఆర్‌డీఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్, మరో పది మంది ఉంటారు. ఈనెల 5 నుంచి 16 వరకు సదస్సుల్లో పాల్గొంటారు.
24 రకాలుగా దరఖాస్తుల విభజన
భూభారతి చట్టం కింద భూ సమస్యల పరిష్కారం కోసం రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అసైన్డ్, భూ విస్తీర్ణం హెచ్చుతగ్గులు, అచ్చుతప్పులు, పేరు మార్పిడి, విరాస్, భూ సర్వే, రెవెన్యూ అటవీ వివాదాలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్, కొత్త పాసుపుస్తకాల జారీ, ఇనామ్ భూములు, సివిల్ వివాదాలు, సక్సేషన్, నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపు, దళిత బస్తీ కింద భూముల కేటాయింపు, ఉచిత న్యాయ సహాయం వంటి 24 రకాలుగా దరఖాస్తులను విభజించారు.
ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు
పైలెట్ ప్రాజెక్టు కింద భూభారతి సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి ప్రత్యేక ఫార్మాట్‌లో అధికారులు దరఖాస్తులను స్వీకరించి రసీదులు అందజేస్తారు. దరఖాస్తు ఫాంలో భూ యజమాని పేరు, తండ్రి పేరు, ఆధార్ నంబర్, కులం, కొత్త పట్టా పాసుపుస్తకం ఉందా లేదా, కొత్త పట్టాపాసుపుస్తకం నంబర్, ఖాతా నంబర్, ఫోన్ నంబర్‌తో పాటు 14అంశాలను పొందుపర్చాలి. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపించనున్నారు. ఏ తరహా భూ సమస్యలు అధికంగా ఉన్నాయి.. ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి.. వాటి పరిష్కారానికి ప్రక్రియలో ఏౖమైనా లోపాలున్నాయా.. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన చర్యలేమిటి.. భూ భారతి పోర్టల్‌పై ప్రజా స్పందన ఎలా ఉంది తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
న్యూస్‌రీల్
నేటి నుంచి తెరపైకి ‘భూ భారతి’
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా కొందుర్గు మండలం ఎంపిక
16వ తేదీ వరకు 20 గ్రామాల్లో పూర్తి చేసేలా షెడ్యూల్
భూ సమస్యలపై ప్రత్యేక ఫార్మాట్‌లో దరఖాస్తుల స్వీకరణ
కొందుర్గు మండలంలో సదస్సులు ఇలా..
తేదీ కొందుర్గు తహసీల్దార్ టీం జిల్లేడ్ చౌదరిగూడ తహసీల్దార్ టీం
5 మహదేవ్‌పూర్ రేగడిచిల్కమర్రి
6 శ్రీరంగాపూర్ ఉత్తరాసిపల్లి
7 తంగెళ్లపల్లి ముట్పూర్
8 పర్వతాపూర్ చుక్కమెట్టు
9 సోమవారంపహాడ్ ఉమ్మెంత్యాల లాలపేట
12 బైరంపల్లి ఆగిర్యాల
13 వెంకిర్యాల విశ్వనాథ్‌పూర్
14 చిన్నఎల్కిచర్ల గోవిందాపూర్–డి
15 చెర్కుపల్లి కొందుర్గు తూర్పు
16 టేకులపల్లి కొందుర్గు పడమర
రెండు బృందాలతో..
మండలంలోని ప్రతి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం. ఇందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశాం. నిర్ణయించిన తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉంటారు. భూ సమస్యలు ఉన్న రైతులు సదస్సులకు హాజరై దరఖాస్తులు అందజేయాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రమేష్‌కుమార్, తహసీల్దార్, కొందుర్గు

రెవెన్యూ సదస్సులు