మహేశ్వరం: మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణానాయక్ తెలిపారు. కార్యక్రమానికి ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో వారు సమావేశం నిర్వహించి మాట్లాడారు. మహేశ్వరం మండల పరిషత్ సమావేశ మందిరంలో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణస్వీకారం అధికారుల సమక్షంలో నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 7 గంటలకు తుక్కుగూడ ఔటర్‌రింగ్ రోడ్డు ఎగ్జిట్ నుంచి మంత్రి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రమాణస్వీకారానికి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంబాలపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, మహేశ్వరం టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంగరిగళ్ల లాజర్, నాయకులు చంద్రమోహన్, ఈశ్వర్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
హాజరుకానున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌సభావత్ కృష్ణానాయక్