
వర్గీకరణ తరువాతే ఉద్యోగాల భర్తీ
ఆమనగల్లు: ఎస్సీ వర్గీకరణ చేసిన తరువాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, మాదిగలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పోతుగంటి కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ తలకొండపల్లి మండల కేంద్రంలో సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారం ఐదో రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరాన్ని సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతయ్య ప్రారంభించారు. శిబిరంలో నాయకులు బాలస్వామి, రాములు, శివ, పెంటయ్య, ప్రదీప్, మహేశ్, శంకరయ్య, జగన్‌లు కూర్చున్నారు. కార్యక్రమంలో సమితి నాయకులు కుమార్, నారాయణ, సంపత్, మహేశ్, శేఖర్, సురేశ్, జంగయ్య, గిరి, ఉపేందర్ పాల్గొన్నారు.