
వైన్స్‌లో చోరీ.. వ్యక్తి హత్య
షాబాద్: వైన్ షాపులో చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు.. అడ్డు వచ్చిన వ్యక్తిని హత్య చేశారు. ఈ సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్‌కు చెందిన చేగూరి భిక్షపతి అలియాస్ ప్రవీణ్(35) మండల కేంద్రంలోని దుర్గావైన్స్ పక్కన ఉన్న కూల్ పాయింట్(కూల్ డ్రింక్స్ షాప్)లో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి పని ముగించుకుని వైన్‌షాపు పక్కన పర్మిట్ రూమ్‌లో పడుకున్నాడు. అర్ధరాత్రి తర్వాత వైన్స్ వెనక గోడను పగులగొట్టిన దుండగులు లోనికి ప్రవేశించి, క్యాష్‌కౌంటర్‌లోని రూ.40 వేల నగదుతో పాటు మద్యం బాటిళ్లు, సీసీ కెమెరా డివైజ్‌ను తీసుకుని బయటకు వచ్చారు. వీరి అలికిడితో మెలకువ వచ్చిన ప్రవీణ్ దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేయగా బలమైన ఆయుధంతో అతని తలపై మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. చేవెళ్ల ఏసీపీ కిషన్, క్రైమ్ ఏసీపీ శంశాక్‌రెడ్డి, సీసీఎస్, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్లు ప్రశాంత్, రమణారెడ్డి, డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దుండగులను పట్టుకునేందుకు ఆయా ప్రదేశాల్లోని సీసీ కెమెరా పుటేజీలు పరిశీలిస్తున్నారు. వారం రోజుల క్రితం నాగర్‌గూడ వైన్స్‌లో చోరీ ఘటనను మరవకముందే షాబాద్ వైన్స్‌లో ఈ ఘటన జరగడం గమనార్హం. మృతుడికి వివాహం కాలేదు. తల్లి బాలమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గోడకు కన్నం వేసి లోనికి చొరబడిన దుండగులు
రూ.40 వేలు, మద్యం బాటిళ్లు, సీసీ కెమెరాల డివైజ్ చోరీ
అడ్డుకునేందుకు వెళ్లిన వ్యక్తిపై ఆయుధంతో దాడి
అక్కడికక్కడే మృతిచెందిన బాధితుడు
షాబాద్‌లో ఘటన
వివరాలు వెల్లడించిన సీఐ కాంతారెడ్డి

వైన్స్‌లో చోరీ.. వ్యక్తి హత్య

వైన్స్‌లో చోరీ.. వ్యక్తి హత్య