సినీ దర్శకుడిపై కర్రలతో దాడి | - | Sakshi
Sakshi News home page

సినీ దర్శకుడిపై కర్రలతో దాడి

Mar 14 2025 7:44 AM | Updated on Mar 14 2025 7:44 AM

సినీ

సినీ దర్శకుడిపై కర్రలతో దాడి

బంజారాహిల్స్‌: ప్రమాదకరంగా బైక్‌లపై దూసుకెళ్తున్న యువకులను ఎందుకలా డ్రైవ్‌ చేస్తున్నారంటూ ప్రశ్నించిన సినీ డైరెక్టర్‌పై స్కూటరిస్టులు కర్రలతో దాడి చేసి గాయపరిచిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌–5లో నివసించే సినీ దర్శకుడు మీర్జాపురం అశోక్‌తేజ బుధవారం రాత్రి మాదాపూర్‌ నుంచి కృష్ణానగర్‌ వెళ్తుండగా జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌–10 నుంచి రెండు బైక్‌లపై నలుగురు యువకులు మద్యం మత్తులో ర్యాష్‌ డ్రైవ్‌ చేస్తూ ఓవర్‌టేక్‌ చేస్తూ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారు. దీనిని గుర్తించిన అశోక్‌ తేజ ఎందుకలా స్పీడ్‌గా వెళ్తున్నారని ప్రశ్నించాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు అతడిని చుట్టుముట్టి కర్రలతో దాడి చేశారు. వారి బారినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వదిలిపెట్టలేదు. దీనిని గుర్తించిన వాహనదారులు అక్కడికి చేరుకోవడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. సదరు యువకులు పల్సర్‌, ఎఫ్‌జెడ్‌ బైక్‌లపై రాత్రిళ్లు ఆవారాగా తిరుగుతూ, దారిన పోయేవారిని వేధిస్తూ ప్రశ్నిస్తే కొడుతూ అందినకాడికి డబ్బులు లాక్కుంటున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

భార్యను కడతేర్చిన భర్త

రహమత్‌నగర్‌ : కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన సంఘటన బోరబండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రహమత్‌నగర్‌ డివిజన్‌ రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన నరేందర్‌ స్ధానికంగా మిల్క్‌ బూత్‌ నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య పద్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి కూడా వారి మధ్య మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహానికి లోనైన నరేందర్‌ పద్మ(50)ను గొంతు నులిమి హత్య చేఽశాడు. గురువారం ఉదయం బోరబండ పోలీసుల ఎదుట లొంగి పోయాడు. సంఘటనా స్ధలాన్ని వెస్ట్‌ జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌, ఎస్‌ఆర్‌నగర్‌ ఏసీపీ వెంకటరమణ పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సిలిండర్‌తో మోది..

తల్లిని దారుణంగా హత్య చేసిన తనయుడు

ఆస్తి వివాదాలే కారణం

శంషాబాద్‌: ఆస్తి కోసం ఓ వ్యక్తి కన్న తల్లిని దారుణంగా హత్యచేసిన సంఘటన శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఆర్‌జీఐఏ ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. రాళ్లగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన చంద్రకళ(60)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రకాష్‌ (35) ఆవారాగా తిరిగేవాడు. గతంలో అతను రెండు పెళ్లిళ్లు చేసుకోగా ఇద్దరు భార్యలు అతడిని విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం మూడో భార్యతో కలిసి ఉంటున్న అతడికి ఇద్దరు కుమార్తెలు. రాఘవేంద్రకాలనీలోని వంద గజాల ఇంటిలో తన వాటా తనకు ఇవ్వాలని ప్రకాష్‌ గత కొన్నాళ్లుగా తల్లిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆస్తి పత్రాలు తనకు ఇవ్వాలని వేధిస్తున్నా అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో తల్లి నిరాకరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో పలుమార్లు తల్లితో గొడవ పడటంతో ఆర్‌జీఐఏ పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు.

మద్యం మత్తులో ఘాతుకం

బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ప్రకాష్‌ ఆస్తి పత్రాల కోసం మరోమారు తల్లితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన అతను పక్కనే ఉన్న కర్రతో పాటు గ్యాస్‌ సిలిండర్‌తో తల్లిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సినీ దర్శకుడిపై కర్రలతో దాడి 
1
1/1

సినీ దర్శకుడిపై కర్రలతో దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement