
భవనం పైనుంచి పడి వృద్ధుడి మృతి
మొయినాబాద్: మొదటి అంతస్తు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలైన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పీఎస్ పరిధిలోని కనకమామిడిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దింటి గోవింద్‌రెడ్డి(75) కుటుంబం మొదటి అంతస్తులో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి బయట ఏదో గొడవ జరుగుతుందని చూడటానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. మొదటి అంతస్తుకు రేలింగ్ లేకపోవడంతో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డిన ఆయన్ను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వృద్ధుడు గురువారం సాయంత్రం మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.