
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన అమీర్‌పేట శ్రీశైలం(55) వారం రోజుల కింద తన వ్యవసాయ పొలం నుంచి బైక్‌పై ఇంటికొస్తున్నాడు. రోడ్డు దాటుతుండగా చౌదర్‌పల్లి గేట్ కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీశైలంను పోలీసులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు.