ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం

Mar 11 2025 7:24 AM | Updated on Mar 11 2025 7:25 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగించుకుని బ్యాంకు లావాదేవీలను కొనసాగించాలని రిజర్వ్‌ బ్యాంకు అధికారి రెహమాన్‌ అన్నారు. మార్చి 10 నుంచి 16 వరకు డిజిటల్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని ఎల్మినేడు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ పేమెంట్స్‌పై అవగహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రిజ ర్వు బ్యాంకు అధికారులు ఎ.సావిత్రి, ఎ.రెహమాన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. డిజిటల్‌ టెక్నాలజీని సురక్షితంగా వినియోగించుకోవాలని సూచించారు. థర్డ్‌ పార్టీ యాప్‌ల జోలికి పోకుండా నేరుగా బ్యాంకులు సూ చించిన యాప్‌ల సహకారంతోనే లావాదేవిలు కొనసాగించాలని చెప్పారు. ఆర్థిక అక్షరాస్యతపై అందరికి అవగహన అవసరమన్నారు. నగదు రహిత లావాదేవిలు చేసే సమయంలో సైబర్‌ మోసాల బారీన పడకుండా జాగ్రత్తలు పాటించాలని వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు డిజిటల్‌ పేమెంట్స్‌పై ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీనియర్‌ బిజినెస్‌ మేనేజర్‌ ఎం.మురళీకృష్ణ, కె.సుధాకర్‌, బ్యాంక్‌ మేనేజర్‌ శిరీష్‌చంద్ర, ఎస్‌.నవీన్‌కుమార్‌, అనిత, విద్యార్థులు పాల్గొన్నారు.

డిజిటల్‌ లావాదేవీలే సురక్షితం

రిజర్వ్‌ బ్యాంకు అధికారి రెహమాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement