షాద్‌నగర్‌కు విచ్చేసిన మోహన్ భగవత్
షాద్‌నగర్: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ ఆదివారం రాత్రి షాద్‌నగర్‌లో బస చేశారు. పట్టణంలోని సీఎస్‌కే విల్లాస్‌లో నివసిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త నాగిళ్లకుమారస్వామి ఇంట్లో బస చేశారు. ఈ సందర్భంగా నాగిళ్లకుమారస్వామి కుటుంబ సభ్యులు మోహన్ భగవత్‌కు ఘన స్వాగతం పలికారు. కర్నూల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన రాత్రి షాద్‌నగర్ పట్టణానికి చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఏసీపీ కుశాల్కర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం అల్పాహారం చేసి బీదర్‌లో నిర్వహించే కార్యక్రమానికి మోహన్ భగవత్ వెళ్లనున్నారు.
టీ హబ్‌ను సందర్శించిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి
మూడు ఒప్పందాలపై సంతకాలు
హఫీజ్‌పేట్: హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీ హబ్‌ను ఆదివారం వెస్ట్రన్ ఆస్ట్రేలియా అత్యవసర సేవల మంత్రి స్టీఫెన్ డాసన్ సందర్శించారు. అధికారులతో సమావేశమై భవన నిర్మాణం, స్టార్టప్‌ల వివరాలు, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఇది భారతదేశం యొక్క మార్గదర్శక ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌గా గుర్తింపు పొందిందని టీహబ్ అధికారులు ఆయనకు వివరించారు. సైబర్ సెక్యూరిటీ పరిశోధన ఆవిష్కరణలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ముందంజలో ఉందని స్టీఫెన్ డాసన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడ్ కమిషనర్ నషీదా చౌదరి, టీహబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనీష్ అంధోని, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఈఓ డాక్టర్ శ్రీరామ్‌తో పాటు ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా.. సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది.
నడకతో ఆరోగ్యం
ఖైరతాబాద్: నడకతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అవగాహన కల్పిస్తూ కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన వాక్ నిర్వహించారు. జలవిహార్ వేదికగా ఆదివారం కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాక్ ఎ మైల్ టు స్టాప్ క్లాట్ పేరుతో నిర్వహించిన అవగాహన వాక్‌లో సినీనటి మంచు లక్ష్మి, కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ నరేంద్రనాఽథ్ మేడా, యువతీ యువకులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.


