జిల్లా ఉత్తమ వైద్య ఉద్యోగిగా జ్యోతి | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఉత్తమ వైద్య ఉద్యోగిగా జ్యోతి

Mar 27 2023 4:32 AM | Updated on Mar 27 2023 4:32 AM

అవార్డు అందుకుంటున్న జ్యోతి  - Sakshi

అవార్డు అందుకుంటున్న జ్యోతి

ఇబ్రహీంపట్నం: క్షయ రోగులకు ఉత్తమ సేవలందించిన ఇబ్రహీంపట్నం డివిజన్‌ టీబీహెచ్‌వీ ఉద్యోగి ఎం జ్యోతిని జిల్లాస్థాయి అవార్డు వరించింది. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని కామినేని ఆడిటోరియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా టీబీ అధికారి డా. అరుణకుమారి చేతుల మీదుగా జ్యోతి ఉత్తమ సేవ అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. క్షయ వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకునేందుకు వైద్య శిబిరాలు నిర్వహించి సేవలు అందించడం, ఈ వ్యాధి నివారణపై అవగాహన కల్పించడంలో ఆమె కీలకపాత్రను పోషించింది.

అవార్డు బాధ్యతను పెంచింది

జిల్లాస్థాయి అవార్డు నా బాధ్యతను మరింత పెంచిందని జ్యోతి అన్నారు. విధి నిర్వహణలో భాగంగా క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య సూత్రాలు వివరించా. క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధి సులువుగా నయం అవుతుందన్న వివరించా. అవార్డుకు ఎంపిక చేసిన జిల్లా ఽఅధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ధరణికుమార్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

క్షయ వ్యాధి నివారణకు కృషి చేసినందుకు అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement