ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి

May 26 2026 12:05 AM | Updated on May 26 2026 12:05 AM

తంగళ్లపల్లి: మండలంలోని సారంపల్లిలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ సిద్దిపేట–హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై సోమవారం రైతులు బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఐకేపీ కేంద్రాల్లో రైతులు కాంటా పెట్టి రో జులు గడుస్తున్నా ఒక్క లారీ కూడా రావడం లేద న్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు, కలెక్టర్‌ స్పందించి కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపి ధాన్యం తరలించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement