కష్టపడితే ఉన్నత శిఖరాలు | - | Sakshi
Sakshi News home page

కష్టపడితే ఉన్నత శిఖరాలు

May 26 2026 12:05 AM | Updated on May 26 2026 12:05 AM

ఎల్లారెడ్డిపేట: అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అనే మూల సిద్ధాంతాలకు కట్టుబడి.. ప్రతీ ఒక్కరు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని స్వెరోస్‌ నెట్‌వర్క్‌ రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీ మారుపాక రాజు కోరారు. స్వెరోస్‌ నెట్‌వర్క్‌ విక్టరీ డే సందర్భంగా సోమవారం రాచర్ల బొప్పాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 500కు పైగా మార్కులు సాధించిన పదో తరగతి విద్యార్థులు 20 మందిని సన్మానించారు. ఎంఈవో కృష్ణహరి, సర్పంచ్‌ ఇల్లందుల గీతాంజలి, స్వెరోస్‌ నెట్‌వర్క్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల మహేశ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు తెడ్డు నరేశ్‌, మండల అధ్యక్షుడు గుర్రాల రాజశేఖర్‌రెడ్డి, హెచ్‌ఎం కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement