సిరిసిల్లలో హిమాన్షు సందడి | - | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో హిమాన్షు సందడి

May 26 2026 12:05 AM | Updated on May 26 2026 12:05 AM

సిరిసిల్లటౌన్‌/గంభీరావుపేట/వేములవాడ: మాజీ సీఎం కేసీఆర్‌ మనవడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లాలో సందడి చేశారు. తన స్నేహితులతో కలిసి పట్టణానికి వచ్చిన హిమాన్షు షాపింగ్‌ చేశారు. చేనేత శిల్పి వెల్ది హరిప్రసాద్‌ ఇంటికెళ్లి చేనేత చీరలను ఖరీదు చేశారు. కేటీఆర్‌ ఫొటోతో నేసిన ఉత్పత్తులను తిలకించారు. అనంతరం తన తండ్రి వీరాభిమాని గాంధీచౌక్‌లో నెలకొల్పిన కేటీఆర్‌ టీస్టాల్‌ను సందర్శించి, స్నేహితులతో కలిసి చాయ్‌ తాగారు. అంతకుముందు వేములవాడ భీమేశ్వరస్వామి దర్శించుకున్నారు. అక్కడి నుంచి గంభీరావుపేటలోని కేజీ టు పీజీ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఎస్‌పీటీడీసీ మాజీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, పార్టీ రాష్ట్ర నాయకుడు బొల్లి రామ్మోహన్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఏనుగు మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement